దొనబండ క్వారీలో విషాదం | Two Labour killed in quarries at Donabanda | Sakshi
Sakshi News home page

దొనబండ క్వారీలో విషాదం

Jul 22 2016 12:07 PM | Updated on Aug 25 2018 6:13 PM

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ క్వారీలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది.

విజయవాడ : కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ క్వారీలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. క్వారీలో పనులు చేస్తున్న ఇద్దరు కార్మీకులు 100 అడుగులపై నుంచి కిందపడ్డారు. దీంతో రూబెన్ అనే కార్మికుడు మృతి చెందాడు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. సహచర కార్మికులు వెంటనే స్పందించి...క్షతగాత్రుడిని  విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్టు మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement