లారీని ఢీకొట్టిన మరో లారీ: ఇద్దరి మృతి | Two killed in road accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన మరో లారీ: ఇద్దరి మృతి

Jun 12 2016 2:07 PM | Updated on Aug 30 2018 4:07 PM

వేగంగా వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు.

వేగంగా వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి నిమ్మకాయల లోడుతో లక్నోకు వె ళ్తున్న లారీ జైపూర్ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ వెంకటపతితో పాటు క్లీనర్ నరసింహా అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement