‘మీరు దళితులు.. గుడిలోకి రావొద్దు’ | two groups friction in peddamma temple celebrations | Sakshi
Sakshi News home page

‘మీరు దళితులు.. గుడిలోకి రావొద్దు’

Aug 10 2016 4:37 PM | Updated on Sep 4 2017 8:43 AM

మెదక్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెద్దమ్మ తల్లి గుడిలోకి రాకుండా దళితులను అడ్డుకున్నారు.

జిన్నారం: మెదక్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెద్దమ్మ తల్లి గుడిలోకి రాకుండా దళితులను అడ్డుకోవడంతో.. వారంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని జిన్నారం మండలం మంబపూర్ గ్రామంలో రెండు రోజులుగా పెద్దమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో డప్పు కొడుతున్న దళితులను ఆలయ ప్రాంగణంలోనికి రాకుండా నిషేధించారు. దీంతో కోపోద్రిక్తులైన దళితులు బలవంతంగా ఆలయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించగా.. అగ్రకులాల వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంతకి గుడిలోపలికి దళితులను రానివ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారితో చర్చలు జరుపుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement