వడదెబ్బ తగిలి ఇద్దరి మృతి | two died in vizianagaram due to sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బ తగిలి ఇద్దరి మృతి

Jun 2 2016 11:51 AM | Updated on Aug 25 2018 6:06 PM

వడదెబ్బ ధాటికి జిల్లా వ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. రొంగలి చంద్రరావు(35) అనే వ్యక్తి బుధవారం ఉదయం వడదెబ్బ తగిలి మృతి చెందాడు.

విజయనగరం: వడదెబ్బ ధాటికి జిల్లా వ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. ఎస్.కోట పట్టణంలో మొండివీధికి చెందిన రొంగలి చంద్రరావు(35) అనే వ్యక్తి బుధవారం ఉదయం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఉదయం తొమ్మిది గంటలకు కూలి పనులకు కాపుసోపురం వెళ్లాడు. 11.30 గంటల సమయంలో కళ్లు తిరిగి పడిపోయి మృతి చెందాడు. జియ్యమ్మవలస  మండలంలోని  చినబురిడి గ్రామానికి చెందిన  నారంశెట్టి గోపాలకృష్ణ (46) ఉపాధి పనులకు వెళ్తూ  కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే సహచరులు చినమేరంగి పీహెచ్‌సీకి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తరలిస్తుండగా మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement