ఇంటర్‌ పరీక్షల్లో ఇద్దరు డీబార్‌ | two debar of inter exams | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షల్లో ఇద్దరు డీబార్‌

Mar 2 2017 9:14 PM | Updated on Aug 25 2018 6:06 PM

ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా గురువారం ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులకు తెలుగు, సంçస్కృతం, ఉర్దూ, హిందీ పరీక్ష జరగగా, ఒకేషనల్‌ విద్యార్థులకు జనరల్‌ ఫౌండేషన్‌ కోర్స్‌ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డీబార్‌ అయ్యారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా గురువారం ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులకు తెలుగు, సంçస్కృతం, ఉర్దూ, హిందీ పరీక్ష జరగగా, ఒకేషనల్‌ విద్యార్థులకు జనరల్‌ ఫౌండేషన్‌ కోర్స్‌ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డీబార్‌ అయ్యారు. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రంలో ఒక విద్యార్థి, అనంతపురం పీఆర్‌కే బాలికల జూనియర్‌ కళాశాల కేంద్రంలో ఒక విద్యార్థి కాపీ కొడుతూ పట్టుబడడంతో డీబార్‌ చేశారు.

మొత్తం 31,041 మంది విద్యార్థులకు గాను 30,325 మంది విద్యార్థులు హాజరయ్యారు. 716 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 28,711 మందికి గాను 28,061  మంది హాజరయ్యారు. 650 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌ విద్యార్థులు 2330 మందికి గాను 2264 మంది హాజరయ్యారు. 66 మంది గైర్హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement