హత్య కేసులో ఇద్దరి అరెస్టు | Two arrested in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఇద్దరి అరెస్టు

Dec 15 2016 12:26 AM | Updated on Aug 20 2018 4:27 PM

మండలంలోని అలుగుంటువారిపల్లికి చెందిన చలపతిని హత్య చేసిన కేసులో మణికుమార్‌, సిద్దయ్య అనే నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు కదిరి రూరల్‌ సీఐ రవికుమార్‌, నంబులపూలకుంట ఎస్‌ఐ రమేశ్‌బాబు తెలిపారు.

నంబులపూలకుంట: మండలంలోని అలుగుంటువారిపల్లికి చెందిన చలపతిని హత్య చేసిన కేసులో మణికుమార్‌, సిద్దయ్య అనే నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు కదిరి రూరల్‌ సీఐ రవికుమార్‌, నంబులపూలకుంట ఎస్‌ఐ రమేశ్‌బాబు తెలిపారు. గత ఏడాది మార్చి 13న గ్రామ సమీపంలో చలపతిని హతమార్చారు. అప్పట్లో అనుమానాస్పద స్థితి కేసుగా పోలీసులు నమోదు చేశారు. అయితే అతన్ని కొట్టి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టు రావడంతో ఆ తరువాత హత్య కేసుగా నమోదు చేశామన్నారు. విచారణలో పైన పేర్కొన్న ఇద్దరు నిందితులు తామే హతమార్చినట్లు విచారణలో అంగీకరించారన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement