ఎండవేడికి కరిగిన రైలు పట్టాలు! | train rails melted with heavy heat from sun on warangal distic | Sakshi
Sakshi News home page

ఎండవేడికి కరిగిన రైలు పట్టాలు!

Apr 22 2016 6:18 AM | Updated on Sep 3 2017 10:26 PM

ఎండవేడికి కరిగిన రైలు పట్టాలు!

ఎండవేడికి కరిగిన రైలు పట్టాలు!

ఎండ తీవ్రతకు రైలు పట్టాలు మెత్తబడి ఆరుచోట్ల గుంతలు పడిన ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపం లో గురువారం చోటుచేసుకుంది.

కేసముద్రం: ఎండ తీవ్రతకు రైలు పట్టాలు మెత్తబడి ఆరుచోట్ల గుంతలు పడిన ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపం లో గురువారం చోటుచేసుకుంది. కేసముద్రం స్టేషన్ నుంచి డౌన్‌లైన్‌లో  ఎండతీవ్రతకు ట్రాక్‌పై రెండు పట్టాలకు 1.90 సెంటీమీటర్ల దూరం చొప్పున ఆరుచోట్ల మెత్తబడి పట్టాకు ఉన్న ఇనుపపట్టీలు కరిగి లేచిపోయూరుు.  మరికొన్ని చోట్ల మెత్తబడి గుంతలా మారి పట్టా వెడల్పు అరుుంది. 25 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గూడ్సు రైలు చక్రాలు ఆ పట్టాపై ఏర్పడిన లోతుభాగంలో(గుంతలుగా) ఇరుక్కుపోయి అక్కడే తిరుగుతూ ఉండిపోయాయి. డ్రైవర్ గమనించి స్థానిక రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత వచ్చిన రైళ్లను సిబ్బంది నెమ్మదిగా పట్టాలను దాటించారు.

Advertisement
 
Advertisement
Advertisement