తిరుపతిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం | Trackforce Police Cumbing For Red Sanders Smugglers | Sakshi
Sakshi News home page

తిరుపతిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం

Aug 11 2016 2:52 PM | Updated on Aug 21 2018 7:17 PM

తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పెద్ద ఎత్తున దాడులు చేపట్టారు.

తిరుపతి: తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పెద్ద ఎత్తున దాడులు చేపట్టారు. కరకంబారి సమీపంలో జరిపిన దాడుల్లో 9 మంది ఎర్రకూలీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు జూపార్కు సమీపంలో ఎర్రకూలీల కోసం కూంబింగ్ కొనసాగుతోందని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ శ్రీధర్ మీడియాకు తెలిపారు. మరో వైపు కరకం బారి వద్ద ముగ్గురు ప్రధాన స్మగ్లర్లు తప్పించుకున్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement