అవ్వకు ఎంత కష్టం | too diffcult | Sakshi
Sakshi News home page

అవ్వకు ఎంత కష్టం

Aug 22 2016 8:31 PM | Updated on Sep 4 2017 10:24 AM

అవ్వకు ఎంత కష్టం

అవ్వకు ఎంత కష్టం

నా.. అన్నవారు ఎవరూ లేరు.. కట్టుకున్నవారు.. కన్నవారు గతించారు.. మిగిలింది నేనొక్కదానే.. మాది శ్రీకాకుళం జిల్లా వండవ... అని చెబుతున్న ఆవాల అప్పల నర్సమ్మ (75) ఒక్కరే పిండ ప్రదానం చేస్తుంటే... అయ్యో ఈ ముసలవ్వకు ఎంత కష్టం వచ్చింది అని పలువురు కళ్లొత్తుకున్నారు.

గుణదల : 
నా.. అన్నవారు ఎవరూ లేరు.. కట్టుకున్నవారు.. కన్నవారు గతించారు.. మిగిలింది నేనొక్కదానే.. మాది శ్రీకాకుళం జిల్లా వండవ... అని  చెబుతున్న ఆవాల అప్పల నర్సమ్మ (75) ఒక్కరే పిండ ప్రదానం చేస్తుంటే... అయ్యో ఈ ముసలవ్వకు ఎంత కష్టం వచ్చింది అని పలువురు కళ్లొత్తుకున్నారు. సోమవారం పద్మావతి ఘాట్‌లో తన భర్త, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాళ్లకు ఆమె పిండ ప్రదానం చేసింది. గ్రామంలో జరిగిన ఓ సంఘటన వల్ల తన కుటుంబీకులందరూ చనిపోయారని, తాను ఒక్కదాన్నే మిగిలానని, అకాల మరణం చెందిన తన కుటుంబ సభ్యుల ఆత్మలు శాంతించాలని పిండ ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం నుంచి ఒక్కదాన్నే వచ్చాచని ఆమె తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement