ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం జారీ చేసిన జీఓను సవరించి, వెబ్‌కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల5వ తేదీన విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు సురేష్‌కుమార్, రామశేషయ్య తెలిపారు.
రేపు విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి
Jun 3 2017 11:47 PM | Updated on Sep 5 2017 12:44 PM
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం జారీ చేసిన జీఓను సవరించి, వెబ్‌కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల5వ తేదీన విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు సురేష్‌కుమార్, రామశేషయ్య తెలిపారు. శనివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు వారు మాట్లాడారు. టీచర్లు వ్యతిరేకించినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. పని ఆధారిత పాయింట్లు పక్కాగా వేయాలంటే అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. హేతుబద్ధీకరణతో ప్రభుత్వ పాఠశాలలను మూత వేయాలనుకోవడం తగదన్నారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర్ర నాయకులు జయరాజు, రవికుమార్, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement