టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వాకాటి కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పరీక్ష
Jul 30 2016 11:52 PM | Updated on Jul 11 2019 8:43 PM
హన్మకొండ అర్బన్ : టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వాకాటి కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. 48 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకురావాలన్నారు. ఉదయం 9.30 గంటల్లోగా పరీక్ష కేంద్రానికి రావాలని, ఆలస్యమైన వారిని అనుమతించబోమన్నారు. అభ్యర్థులు షూస్, వాచీలు ధరించి రావద్దన్నారు. అలాగే బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులను మాత్రమే వినియోగించాలన్నారు. ఓఎంఆర్ షీట్‌పై వైట్‌నర్ ఉపయోగిస్తే అనర్హులవుతారని తెలిపారు. టీఎస్ పీఎస్సీ నిబంధనలు ప్రతి అభ్యర్థి పాటించాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement