రహిత లావాదేవీలపై వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు అవగాహన కలిగించేందుకు బుధవారం నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ
నగదు రహిత లావాదేవీలపై నేడు అవగాహన
Dec 7 2016 3:10 AM | Updated on Aug 29 2018 4:18 PM
నల్లగొండ : నగదు రహిత లావాదేవీలపై వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు అవగాహన కలిగించేందుకు బుధవారం నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సదస్సు నిర్వహించనున్నారు. నగదు రహిత లావాదేవీల వ్యవహారాలను పరిశీలించేందుకు నోడల్ అధికారులుగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ నారాయణరెడ్డిలను నియమించారు. పెద్దనోట్ల రద్దుతో వాణిజ్య రంగాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారిం చేందుకు డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం జిల్లాలో నగదు రహిత లావాదేవీలను పర్యవేక్షించేందుకు కలెక్టర్, జేసీలను నోడల్ అధికారులుగా నియమించడంతో పాటు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖలకు చెందిన అనుబంధ రంగాలకు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించాలని సర్కారు సూచించింది. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు ఒక్కో గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దాలను కలెక్టర్ బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. దీనిలో భాగంగానే బుధవారం ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాక్ హోల్డర్లకు అవగాహన కల్పించనున్నారు. ఈ సదస్సు సుమారు 600 మందిని ఆహ్వానించారు. డిజిటల్ చెల్లింపులపై తొలిసారిగా జరుగుతున్న సదస్సుకు జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
సదస్సుకు హాజరుకావాల్సిన వారు...
రేషన్ డీలర్లు, పెట్రోల్ బంక్‌ల యజమానులు, గ్యాస్ ఏజెన్సీలు, ఫర్టిలైజర్స్, ఫస్టిసైడ్‌స యజమానులు, స్వయం సహాయక సంఘాలు, బుక్ కీపర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మీసేవ ఆపరేటర్లు, ట్రేడర్స్, మార్కెటింగ్ కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శులు, బ్యాంకర్లు, బిల్ కలెక్టర్లు, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు, జనరల్ స్టోర్స్, బట్టల దుకాణాల యజమానులు, ప్రభుత్వ ఫించనర్లు, హోటల్ యజమానులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఆటో డ్రైవర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మద్యం దుకాణాల యజమానులు, బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు హాజరుకావాలని అధికారులు పేర్కౌన్నారు.
Advertisement
Advertisement