నిజామాబాద్ ఎంపీ కవిత సోమవారం జిల్లాలో పర్యటిస్తారని టీఆర్‌ఎస్ నాయకులు
నేడు ఎంపీ కవిత జిల్లా పర్యటన
Aug 28 2016 10:04 PM | Updated on Sep 4 2017 11:19 AM
చంద్రశేఖర్‌కాలనీ : నిజామాబాద్ ఎంపీ కవిత సోమవారం జిల్లాలో పర్యటిస్తారని టీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కంuó శ్వర్ బైపాస్‌రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హరితహరం కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం శ్రద్ధానంద్‌గంజ్‌లో నిజామాబాద్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవంలో, నిజామాబాద్ మండలం నర్సింగ్‌పల్లి సమీపంలో గల కస్‌బాగ్ తండాలో తీజ్ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.
Advertisement


