నేడు జూనియర్‌ కాలేజీల బంద్‌ | today junior colleges bandh | Sakshi
Sakshi News home page

నేడు జూనియర్‌ కాలేజీల బంద్‌

Jul 13 2017 12:13 AM | Updated on Sep 5 2017 3:52 PM

జిల్లాలో గురువారం.. జూనియర్‌ కాలేజీల బంద్‌ చేపడుతున్నట్లు అఖిల భారత విద్యార్థి పరిషత్‌ జిల్లా కన్వీనర్‌ మహేంద్ర తెలిపారు.

కర్నూలు సిటీ: జిల్లాలో గురువారం.. జూనియర్‌ కాలేజీల బంద్‌ చేపడుతున్నట్లు అఖిల భారత విద్యార్థి పరిషత్‌ జిల్లా కన్వీనర్‌ మహేంద్ర తెలిపారు. బుధవారం స్థానిక సెంట్రల్‌ ప్లాజాలోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మారుస్తోందన్నారు. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనుమతులు లేకుండా అనుబంధ కాలేజీలను నిర్వహిస్తున్నా.. అధికారులు తనిఖీలే చేయడం లేదన్నారు.  కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు గణేష్, హర్ష, జయసింహ, మహేష్, రవి, గోపి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement