తాగునీటి సమస్యను పరిష్కరించాలి | To solve the drinking water problem | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

Jan 5 2017 11:04 PM | Updated on Sep 5 2017 12:30 AM

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖానాపూర్‌ మండలం బా దన్ కుర్తి పంచాయతీ పరిధిలోని చింతలపేట్‌ గ్రామస్తులు విన్నవించారు. p

► డీపీవోకు చింతల్‌పేట్‌ గ్రామస్తుల వినతి
నిర్మల్‌రూరల్‌ : ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖానాపూర్‌ మండలం బా దన్ కుర్తి పంచాయతీ పరిధిలోని చింతలపేట్‌ గ్రామస్తులు విన్నవించారు. ఈమేరకు వారు బుధవారం డీపీవో నారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో మూడేళ్లుగా తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వాటర్‌ ట్యాంక్‌లకు నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.

స్థానిక ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డీపీవోను కోరారు. ఇందులో టీడీపీ మండలాధ్యక్షుడు గుడాల రాజన్న, వార్డ్‌మెంబర్‌ బండి వెంకటి గ్రామ స్వచ్ఛంద సంస్థ సభ్యులు బైర మధు, ఎర్ర గంగన్న, మాదస్తు నవీన్   పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement