కొనసాగుతున్న ‘పుష్కర పార్కింగ్‌’ పనులు | to continued in pushkara works | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ‘పుష్కర పార్కింగ్‌’ పనులు

Aug 5 2016 1:05 AM | Updated on Mar 19 2019 9:23 PM

ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు.

చింతపల్లి : ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అజ్మాపురం, పెద్దమునిగల్, కాచరాజుపల్లి పుష్కర ఘాట్లతో పాటు నాగార్జునసాగర్‌కు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లోభాగంగా హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు వింజమూరు సమీపంలో 70 ఎకరాలలో పార్కింగ్‌ స్థలంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సదుపాయాలకు  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, ఆర్డీఓ గంగాధర్, నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డిలు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం పార్కింగ్‌ స్థలం వద్ద చెట్ల తొలగింపుతో రోడ్లు, మూత్రశాలలకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement