రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం | three people died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

Jun 3 2016 12:05 AM | Updated on Apr 3 2019 7:53 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

డీసీఎం, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.

టిప్పర్, డీసీఎం ఢీకొనడంతో ప్రమాదం
మృతుల్లో ఇద్దరు మహబూబ్‌నగర్ జిల్లావాసులు

 మేడ్చల్ రూరల్: డీసీఎం, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని బాసిరేగడి వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. వుహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వుండలం తునికీపూర్‌కు చెందిన వుువ్ముళ్ల రాజు(26), అతడి చిన్నాన్న కుమారుడు వుహబూ (21) మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లోని నవదీప్ ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్నారు. డీసీఎం (ఏపీ 28 టీసీ 8509) డ్రైవర్‌గా రాజు, వుహబూ క్లీనర్‌గా జీవనం సాగిస్తున్నారు. మేడ్చల్ వుండలం గిర్మాపూర్ రాక్‌సాండ్‌లో జార్ఖాండ్‌కు చెందిన రితూ వుహతో(29) టిప్పర్ నడిపిస్తున్నాడు.

బుధవారం అర్ధరాత్రి డీసీఎం కూల్‌డ్రింక్ లోడ్‌తో దుండిగల్ -మేడ్చల్ దారిలో మేడ్చల్ వైపు వస్తుంది. టిప్పర్ కంకర లోడ్‌తో మేడ్చల్ నుంచి దుండిగల్ వైపు వెళ్తుంది. వుండలంలోని బాసిరేగడి సమీపంలో టిప్పర్, డీసీఎం వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ రాజు, టిప్పర్ డ్రైవర్ రీతూ వుహతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన డీసీఎం క్లీనర్ వుహబూబ్‌ను హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణం విడిచాడు. మృతదేహాలను మేడ్చల్ వూర్చురీకి తరలించారు. మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖరరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement