హత్య కేసులో మరో ముగ్గురు అరెస్టు | three arrest in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో మరో ముగ్గురు అరెస్టు

Jul 27 2017 10:37 PM | Updated on Sep 5 2017 5:01 PM

మండల పరిధిలోని కాలువపల్లి వద్ద ఈనెల 22న జరిగిన హరిజన సోమశేఖర్‌ (25) హత్య కేసులో ఇప్పటికే ప్రదాన ముద్దాయి హరిజన ఆంజినేయులును అరెస్టు చేసిన పోలీసులు గురువారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

బెళుగుప్ప : మండల పరిధిలోని కాలువపల్లి వద్ద ఈనెల 22న జరిగిన హరిజన  సోమశేఖర్‌ (25) హత్య కేసులో  ఇప్పటికే  ప్రదాన ముద్దాయి  హరిజన ఆంజినేయులును అరెస్టు చేసిన పోలీసులు గురువారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ వివరాలను ఎస్‌ఐ నాగస్వామి విలేకరులకు తెలిపారు.  ఆంజినేయులుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఈ హత్య కేసులో పాల్గొన్నట్లు తేలిందన్నారు. ఆంజినేయులుకు  తన సమీప బంధువులు అయిన ఆత్మకూరుకు చెందిన  హరిజన నాగరాజు, కాలువపల్లికి చెందిన  హరిజన కిరణ్, హరిజన పెద్దన్నలు కూడా ముద్దాయిలేనన్నారు. వీరిని గురువారం గోళ్ల గ్రామానికి సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయ పరిసరాల్లో ఉండగా తమ అదుపులోకి తీసుకున్నామన్నారు. కళ్యాణదుర్గం కోర్టుకు హాజరుపరచగా ఆగస్టు 9 వరకు కోర్టు  రిమాండ్‌ విధించిందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement