సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయారు.. | thieves theft CCTV recorder in medak district | Sakshi
Sakshi News home page

సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయారు..

Feb 9 2016 7:03 PM | Updated on Aug 28 2018 7:30 PM

సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయారు.. - Sakshi

సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయారు..

మెదక్ జిల్లాలో దొంగలు తెలివి మిరిపోయారు. దొంగతనం చేయడంతో పాటు ఏకంగా సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయిన ఘటన పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లిలో చోటుచేసుకుంది.

మెదక్: మెదక్ జిల్లాలో దొంగలు తెలివి మిరిపోయారు. దొంగతనం చేయడంతో పాటు ఏకంగా సీసీ టీవీ రికార్డర్ని కూడా ఎత్తుకుపోయిన ఘటన పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక మల్లిఖార్జున రైస్‌మిల్‌లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. నగదుతో పాటు సీసీ టీవీ కెమెరాలను, రికార్డర్ని ఎత్తుకుపోయారు.

రైస్మిల్లు యజమాని సోమవారం రాత్రి తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. టేబుల్‌ను ధ్వంసం చేసిన దుండగులు, బీరువాలోని రూ.1.42 లక్షల నగదును ఎత్తుకుపోయారు. వెళ్తూవెళ్తూ సీసీ టీవీ కెమెరాలను, రికార్డర్ని ఎత్తుకుపోయారు. మిల్లు యజమాని ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement