దొంగల ముఠా అరెస్టు | thieves gang arrest | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్టు

Jun 11 2017 11:51 PM | Updated on Sep 2 2018 3:43 PM

కూడేరు సమీపంలోని డాక్టర్‌ వెంకటస్వామి, పోతప్ప తోటల్లో గాలిమరల కంపెనీ ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలకు సంబంధించిన తీగలను దొంగలించిన దొంగల ముఠాను ఎట్టకేలకు వలపన్ని ఆదివారం అరెస్తు చేసినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

కూడేరు (ఉరవకొండ) : కూడేరు సమీపంలోని డాక్టర్‌ వెంకటస్వామి, పోతప్ప తోటల్లో గాలిమరల కంపెనీ ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలకు సంబంధించిన తీగలను దొంగలించిన దొంగల ముఠాను ఎట్టకేలకు వలపన్ని ఆదివారం అరెస్తు చేసినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. నార్పల మండలానికి చెందిన ఇబ్రహీం, షేక్‌ బాబావలి, గొల్ల నాగలింగ, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, అనిల్‌ బాబు అరెస్టైన వారిలో ఉన్నారు. వారి నుంచి రూ.48,800 నగదు, 290 మీటర్ల విద్యుత్‌ తీగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement