పోలీసుల అదుపులో దొంగ | thief in police custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో దొంగ

Jun 21 2017 8:53 PM | Updated on Sep 5 2017 2:08 PM

పట్టణంలోని అమ్మవారిశాల సమీపంలో గత శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కేసుకు సంబంధించి పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కోవెలకుంట్ల: పట్టణంలోని అమ్మవారిశాల సమీపంలో గత శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కేసుకు సంబంధించి పోలీసులు.. దొంగను  అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రూ. 15 లక్షల నగదు, 3 కిలోల 400 గ్రాముల బంగారు ఆభరణాలు.. అపహరించుకెళ్లినట్లు బాధితుడు పెండేకంటి ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చోరీకి పాల్పడ్డ దొంగను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడ్డ దొంగ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టుబడిన దొంగ నుంచి బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీ కేసు వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement