నెల్లూరు(క్రైమ్): ఇంట్లో అందరూ ఉండగానే గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున కఠారిపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హేమంతకిశోర్, సునీత దంపతులు కఠారిపాలెంలో నివాసముంటున్నారు.
కఠారిపాళెంలో చోరీ: బంగారు అపహరణ
Aug 10 2016 1:44 AM | Updated on Oct 20 2018 6:19 PM
నెల్లూరు(క్రైమ్):
ఇంట్లో అందరూ ఉండగానే గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున కఠారిపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హేమంతకిశోర్, సునీత దంపతులు కఠారిపాలెంలో నివాసముంటున్నారు. సోమవారం రాత్రి హేమంతకిశోర్ వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లాడు. సునీత తన తల్లి, తమ్ముళ్లతో కలిసి ఇంట్లో నిద్రపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు తెరచి లోనికి ప్రవేశించారు. బీరువాను తెరచి అందులో ఉన్న సుమారు రూ.1.50 లక్షలు విలువచేసే 5 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు అపహరించారు. దుండగుల అలికిడి కావడంతో నిద్రనుంచి లేచిన సునీత పెద్దగా కేకలు వేసేసరికే పరారయ్యారు. బాధితులు మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ ప్రభాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


