సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంట్లో చోరీ | Theft in Hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంట్లో చోరీ

Aug 5 2016 8:34 PM | Updated on Oct 22 2018 7:42 PM

నగరంలోని బోడుప్పల్ చెంగిచర్ల క్రాంతి కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులకొట్టి నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి దోచు కెళ్లారు.

నగరంలోని బోడుప్పల్ చెంగిచర్ల క్రాంతి కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులకొట్టి నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి దోచు కెళ్లారు. ఎస్‌ఐ నవీన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని చెంగిచర్ల క్రాంతి కాలనీలో సాంబయ్య కుమారుడు కృష్ణకుమార్ హైటెక్ సిటీలో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గురువారం కృష్ణకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. మరసటి రోజు వారు ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న 4 తులాలు బంగారం, 30 తులాల వెండి చోరీకి గురైంది. వెంటనే మేడిపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కృష్ణకుమార్ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement