చోరీకి యత్నం.. కాలనీవాసుల దేహశుద్ధి | theft and man handling in chilamattor | Sakshi
Sakshi News home page

చోరీకి యత్నం.. కాలనీవాసుల దేహశుద్ధి

Apr 28 2017 12:09 AM | Updated on Oct 8 2018 3:07 PM

చోరీకి యత్నం.. కాలనీవాసుల దేహశుద్ధి - Sakshi

చోరీకి యత్నం.. కాలనీవాసుల దేహశుద్ధి

రాత్రి నిద్రలో ఉన్న మహిళల మెడలో గొలుసులు చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన గురువారం చిలమత్తూరు ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది.

చిలమత్తూరు : రాత్రి నిద్రలో ఉన్న మహిళల మెడలో గొలుసులు చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన గురువారం చిలమత్తూరు ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎస్సీ కాలనీలో ఓ అద్దె గదిలో కర్ణాటక ఉదుగూరు గ్రామానికి  చెందిన బాషా నివాసం ఉంటున్నాడు. ఆ గది పక్కనే ఇంట్లో నివాసం ఉంటున్న మహిళలు గత బుధవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా బాషా వారి మెడలో గొలుసులు లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే గమనించిన మహిళలు గట్టిగా అరవడంతో బాషా పరారయ్యాడు. కాగా బాషా తెల్లవారుజామున అదే కాలనీలో తిరుగుతుండగా కాలనీవాసులు పట్టుకుని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement