బతుకమ్మ పూల కోసం వెళ్లిన మహిళ హత్య | the woman's murdered went to Bathukamma flowers in nalgonda | Sakshi
Sakshi News home page

బతుకమ్మ పూల కోసం వెళ్లిన మహిళ హత్య

Oct 8 2016 11:04 AM | Updated on Aug 29 2018 4:18 PM

బతుకమ్మ పూల కోసం గ్రామ శివారులో చేలలోకి వెళ్లిన ఓ మహిళ హత్యకు గురయింది.

భువనగిరి: బతుకమ్మ పూల కోసం గ్రామ శివారులో చేలలోకి వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురయింది. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల నరసమ్మ(66) శుక్రవారం మధ్యాహ్నం మరో మహిళతో కలసి గ్రామ శివారులోని చేలలోకి వెళ్లింది.

రాత్రయినా ఆమె తిరిగి రాకపోయేసరికి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి వెతుకులాట ప్రారంభించారు. చివరికి గ్రామ శివారులోని కందిచేనులో ఆమె మృతదేహం కనుగొన్నారు. గుర్తు తెలియని దుండగులు ఆమె తలపై కొట్టి, మెడలోని మూడున్నర తులాల పుస్తెల తాడుతోపాటు 5 తులాల వెండి కడియాలను దోచుకున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. బాగా తెలిసిన వారే నరసమ్మను నగల కోసం దారుణంగా చంపారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement