వడ్డివారిపల్లి సమీపంలో కదిరి- హిందూపురం రహదారిపై సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ మగ జింక మృతి చెందింది.
ఓడీ చెరువు: వడ్డివారిపల్లి సమీపంలో కదిరి- హిందూపురం రహదారిపై సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ మగ జింక మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందచేశారు. ఎస్‌ఐ సత్యనారాయణ, ఏఎస్‌ఐ ఇస్మాయిల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన జింకను ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు రామక్రిష్ణరాజు, రేణుకకు అప్పజెప్పారు. తాగునీటి కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉంటుందని వారు భావిస్తున్నారు. జింక వయసు ఏడాదిన్నర ఉంటుందని తెలిపారు.