
ట్రాక్టర్ ఢీ కొని యువకుడు దుర్మరణం
ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ పెనుగొండ రవికుమార్ కథనం మేరకు... మండలంలోని చిన్నపల్లె గ్రామసమీపంలో ఎస్.తిమ్మాపురం చెరువు కట్టపనులను మెగా కంపెనీ చేపడుతోంది. చెరువు కట్ట పై నుంచి ట్రాక్టర్ దిగుతుండగా అదుపు తప్పి కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఇ. రామనాథ (30) పై ఎక్కడంతో అతను అక్కడక్కడే మృతి చెందాడు.
కొండాపురం: ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ పెనుగొండ రవికుమార్ కథనం మేరకు... మండలంలోని చిన్నపల్లె గ్రామసమీపంలో ఎస్.తిమ్మాపురం చెరువు కట్టపనులను మెగా కంపెనీ చేపడుతోంది. చెరువు కట్ట పై నుంచి ట్రాక్టర్ దిగుతుండగా అదుపు తప్పి కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఇ. రామనాథ (30) పై ఎక్కడంతో అతను అక్కడక్కడే మృతి చెందాడు. మండలంలోని పొట్టిపాడు గ్రామానికి చెందిన ఇ.రామనాథ కొన్ని నెలలుగా మెగాకంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.