దొంగలు ఈడ్చుకుంటూ వెళ్లినా వదల్లేదు | The thieves failed to steal the chain | Sakshi
Sakshi News home page

దొంగలు ఈడ్చుకుంటూ వెళ్లినా వదల్లేదు

Aug 20 2016 12:31 AM | Updated on Sep 4 2017 9:58 AM

రాధాబాయిని పరామర్శిస్తున్న కార్పొరేటర్‌

రాధాబాయిని పరామర్శిస్తున్న కార్పొరేటర్‌

గొలుసు స్నాచింగ్‌కు యత్నించిన దొంగలను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది.

చందానగర్‌: గొలుసు స్నాచింగ్‌కు యత్నిం చిన దొంగలను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆమె తీవ్రగాయాలకు గురైంది. వివరాలు...  సురక్షహిల్స్‌కు చెందిన రాధాబాయి శుక్రవారం ఉదయం 7 గంటలకు వాకింగ్‌కు వెళ్లింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన రాధాబాయి వారిని ప్రతిఘటించింది.

దీంతో తోకముడిచిన దొంగలు పారిపోతుండగా రాధాబాయి వారి బైక్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో దొంగలు ఆమెను చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. స్థానిక కార్పొరేటర్‌ బొబ్బ నవతారెడ్డి రాధాబాయి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఎంతో ధైర్యంగా స్నాచర్లను ఎదుర్కొని గొలుసును కాపాడుకున్న ఆమెను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement