అప్పుల బాధ తాళలేక.. | The farmer committed suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక..

Aug 5 2016 5:20 PM | Updated on Oct 1 2018 2:36 PM

పాతాళగంగ కోసం భగీరథ ప్రయత్నాలు చేసిన అన్నదాత అప్పుల పాలై వాటిని తీర్చే దారి కానరాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పాతాళగంగ కోసం భగీరథ ప్రయత్నాలు చేసిన అన్నదాత అప్పుల పాలై వాటిని తీర్చే దారి కానరాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి(42) తనకున్న నాలుగెకరాల భూమిలో ఎనిమిది బోర్లు వేసిన నీరు రాలేదు. బోర్లు వేయడానికి చేసిన అప్పు తీర్చడానికి నగరానికి వచ్చిన లాభం లేకపోవడంతో.. తిరిగి స్వగ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో అప్పుల వారి బాధ పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement