ఎలుగుబంటి దాడిలో వృద్ధురాలు మృతి | The elderly killed in the bear attack | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటి దాడిలో వృద్ధురాలు మృతి

Sep 18 2017 10:15 PM | Updated on Sep 5 2018 2:12 PM

ఎలుగుబంటి దాడిలో కెంచానపల్లికి చెందిన కుమ్మరి సిద్దక్క (70) మృతి చెందింది. కెంచానపల్లికి చెందిన గొల్ల కిష్టప్ప, కుమ్మరి సిద్దక్క, కాశీపురం గ్రామానికి చెందిన కావలి సుధాకర్‌తో పాటు మరో ఇద్దరు ఆదివారం మేకలు, పశువులు తోలుకుని కాశీపురం కొండలోకి వెళ్లారు. వీరిని చూసిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచింది.

రాయదుర్గం రూరల్: ఎలుగుబంటి దాడిలో కెంచానపల్లికి చెందిన కుమ్మరి సిద్దక్క (70) మృతి చెందింది. కెంచానపల్లికి చెందిన గొల్ల కిష్టప్ప, కుమ్మరి సిద్దక్క, కాశీపురం గ్రామానికి చెందిన కావలి సుధాకర్‌తో పాటు మరో ఇద్దరు ఆదివారం మేకలు, పశువులు తోలుకుని కాశీపురం కొండలోకి వెళ్లారు. వీరిని చూసిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచింది. గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి కొండలోకి వెళ్లిపోయింది. గాయపడిన కుమ్మరి సిద్దక్క, సుధాకర్‌ను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా గొల్ల కిష్టప్పను కళ్యాణదుర్గం ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. సిద్దక్క పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement