ఏడాది వయసున్న చిన్నారి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది.
ఏడాది వయసున్న చిన్నారి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. బత్తుల రేణుక(1) అనే పాపను తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గరే వదిలేసి కూలీ పనులకు వెళ్లారు. ఇంటి పక్కనున్న వారికి అప్పగించి వెళ్లగా... పాప ప్రమాదవశాత్తూ సంపులో పడి మృతి చెందింది.