breaking news
water vols
-
నీటి సంపులో పడి చిన్నారి మృతి
ఏడాది వయసున్న చిన్నారి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. బత్తుల రేణుక(1) అనే పాపను తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గరే వదిలేసి కూలీ పనులకు వెళ్లారు. ఇంటి పక్కనున్న వారికి అప్పగించి వెళ్లగా... పాప ప్రమాదవశాత్తూ సంపులో పడి మృతి చెందింది. -
సంపులో పడి బాలుడి మృతి
గచ్చిబౌలి: ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు సంపులో పడి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికంగా అంజయ్య నగర్లో నివాసం ఉంటే రంగస్వామి, సుజాత దంపతుల కుమారుడు చందు (5) సోమవారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతని కోసం తల్లిదండ్రులు రాత్రంతా వెతికినా కనిపించలేదు. మంగళవారం ఉదయం వారు నివాసం ఉండే వీధిలోనే ఓ ఇంటి సంపులో చందు మృతదేహం బయటపడింది. స్థానికులు రాయదుర్గం పోలీస్ స్టేషన్కు సమాచారం అందిచడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.