ముగ్గురు నిందితులు అరెస్ట్‌ | The arrest of three accused | Sakshi
Sakshi News home page

ముగ్గురు నిందితులు అరెస్ట్‌

Oct 28 2016 2:02 AM | Updated on Aug 28 2018 7:24 PM

అరుంధతినగర్‌కు చెందిన చాకలి లింగాల బాలాంజనమ్మతో వ్యభిచారం చేయించేందుకు కుట్ర పన్నిన ముగ్గురిని గురువారం ఉలిందకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు

కల్లూరు (రూరల్‌): అరుంధతినగర్‌కు చెందిన చాకలి లింగాల బాలాంజనమ్మతో వ్యభిచారం చేయించేందుకు కుట్ర పన్నిన ముగ్గురిని గురువారం ఉలిందకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్నూలు రూరల్‌ సీఐ నాగరాజు యాదవ్‌ వివరాల మేరకు .. అరుంధతినగర్‌కు చెందిన  మహమ్మద్‌బీబీ ద్వారా గణేష్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ సూరి, దేవనకొండ మండలం ప్యాలకుర్తికి  చెందిన రాజుకు బాలాంజనమ్మతో  పరిచయం ఏర్పడింది. రాజు కోరిక తీర్చితే రెండెకరాల పొలం, రూ.2 లక్షల నగదు, బంగారం ఇస్తానని మహమ్మద్‌ బీబీ, సూరి ప్రలోభ పెట్టగా బాధితురాలు నిరాకరించింది. ఈ క్రమంలో ఈ నెల 2న బాధితురాలిని హనుమన్న ఆటోలో ఎక్కించుకుని వెళ్తుండగా కల్లూరు మండలం పెద్దటేకూరు ఫ్లైఓవర్‌ సమీపంలో బోల్తాపడి గాయపడగా స్థానికులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డోన్‌లో రుణం ఇప్పిస్తానని సూరి ఆటోలో తీసుకెళ్లాడని మార్గమధ్యలో టీ తాగాక స్పృహ కోల్పోయానని ఉలిందకొండ ఎస్‌ఐ వాగ్మూలం తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గురువారం మహమ్మద్‌బీబీ, ఆటో డ్రైవర్‌ సూరి, రాజు, హనుమన్నను అరెస్ట్‌ చేశారు. సూరి, హనుమన్న ఆటో(ఏపీ 21టీజెడ్‌ 4967, ఏపీ 21టీడబ్ల్యూ 6958) స్వాధీనం చేసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement