దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే కుట్ర | thammineni veerabadram fired on bjp rss | Sakshi
Sakshi News home page

దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే కుట్ర

Feb 28 2016 4:16 AM | Updated on Mar 29 2019 9:31 PM

దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే కుట్ర - Sakshi

దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే కుట్ర

దేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా, మతరాజ్యంగా మార్చేందుకు, మతపరంగా విభజించేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ.. దేశాన్ని ముక్కలు చేస్తున్నాయి : తమ్మినేని
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా, మతరాజ్యంగా మార్చేందుకు, మతపరంగా విభజించేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతిపై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు అబద్ధమన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా స్మృతి ఇరానీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, రోహిత్ మృతి సందర్భంగా జరిగిన ఘటనలకు తామే ప్రత్యక్ష సాక్షులమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement