ఎస్వీయూ మెయిన్‌ గేట్‌ వద్ద ఉద్రిక్తత | tension at svu main gate | Sakshi
Sakshi News home page

ఎస్వీయూ మెయిన్‌ గేట్‌ వద్ద ఉద్రిక్తత

Feb 4 2017 3:31 PM | Updated on Mar 23 2019 9:10 PM

హోదా కోరుతూ.. విద్యార్థులు శాంతియుతంగా చేపడుతున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు

తిరుపతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ.. విద్యార్థులు శాంతియుతంగా చేపడుతున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. తిరుపతిలోని ఎస్వీయూ మెయిన్‌ గేట్‌ వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తుండగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు బలవంతంగా విద్యార్థులను అక్కడినుంచి తరలించారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement