ఎన్‌పీకుంటలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత | temperature details | Sakshi
Sakshi News home page

ఎన్‌పీకుంటలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత

Mar 12 2017 10:42 PM | Updated on Sep 5 2017 5:54 AM

జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేసవితాపం కొనసాగుతోంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేసవితాపం కొనసాగుతోంది. ఆదివారం ఎన్‌పీకుంటలో 41.6 డిగ్రీలు, శింగనమల 41.1 డిగ్రీలు, తాడిపత్రి, చెన్నేకొత్తపల్లి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 35 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 50 నుంచి 80, మధ్యాహ్నం 15 నుంచి 25 శాతం మధ్య రికార్డయింది.

Advertisement
 
Advertisement
Advertisement