కేసీఆర్‌తోనే తెలంగాణాభివృద్ధి

కేసీఆర్‌తోనే తెలంగాణాభివృద్ధి - Sakshi

యాదగిరిగుట్ట: సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. మండలంలోని వంగపల్లి, చొల్లేరు. మోటకొండూర్, తాళ్లగూడెం, సైదాపురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆమె మాట్లాడారు.  తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దాలనే ఆలోచనలతో ప్రజలకు సాగు, తాగు నీరు, ఆసరా ఫించన్లు, కల్యాణలక్ష్మీ, షాద్‌ముభారక్, మిషన్‌ కాకతీయ వంటి పథకాలను అందరికీ చేరేలా కృషి చేస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుమలత, ఆల్డా చైర్మన్‌ మోతే పిచ్చిరెడ్డి, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, వైస్‌ ఎంపీపీ తోటకూరి నర్సయ్య, సర్పంచులు చంద్రగాని నిరోష, కొంతం లక్ష్మీ, కొక్కలకొండ అరుణ, కసావు శ్రీనివాస్‌గౌడ్, పులెపాక స్వరూప, ఎంపీటీసీలు కానుగు కవిత, బాలమ్మ, బుగ్గ పర్వతాలు, బీర్ల మాధవి, ఆరె యాదగిరిగౌడ్, మండలాధ్యక్షులు వెంకటయ్య, రవీందర్‌గౌడ్, కలెపల్లి శ్రీశైలం, నిమ్మయ్య, స్వామి,  సాయికుమార్, వీరాస్వామి, అశోక్, మోహన్‌రెడ్డి, రామకృష్ణ, రాజు, దామోదర్‌ ఉన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top