పోలీసు విధుల్లో టెక్నాలజీ కీలకం | technology important in police duties | Sakshi
Sakshi News home page

పోలీసు విధుల్లో టెక్నాలజీ కీలకం

Feb 23 2017 11:25 PM | Updated on Aug 21 2018 7:18 PM

టెక్నాలజీ పోలీసు విధుల్లో కీలకంగా మారిందని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు.

అనంతపురం సెంట్రల్‌ : టెక్నాలజీ పోలీసు విధుల్లో కీలకంగా మారిందని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. గురువారం డీటీసీలో విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు  నుంచి వచ్చి శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లతో ముఖాముఖి నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ టెక్నాలజీపై పరిజ్ఞానం పెంచుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. ఇండోర్‌ శిక్షణలో భాగంగా ఐపీసీ ఎవిడెన్స్‌యాక్టు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సీఆర్‌పీసీ, స్టేషన్‌హౌస్‌ మేనేజ్‌మెంట్, ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్‌సైన్స్, లా అండ్‌ ఆర్డర్, అవుట్‌డోర్‌లో భాగంగా యోగా, ధ్యానం, వెపన్‌ ట్రైనింగ్, క్రౌండ్‌ కంట్రోల్, ఫీల్డ్‌ క్రాప్ట్‌ తదితర అంశాలపై నిష్ణాతులతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఆయన రూరల్‌ మండలం కామారుపల్లి గ్రామ సమీపంలోని డీటీసీ(జిల్లా శిక్షణా కేంద్రం) కోసం కేటాయించిన స్థలాన్ని  సందర్శించారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీటీసీ డీఎస్పీ ఖాసీంసాబ్, ఏఆర్‌డీఎస్పీ చిన్నికృష్ణ, సీఐలు శివనారాయణస్వామి, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement