‘ఈ–ఫ్రెష్‌’ ద్వారా రైతులకు సాంకేతిక సేవలు | Technical services to the farmers through the e-Fresh | Sakshi
Sakshi News home page

‘ఈ–ఫ్రెష్‌’ ద్వారా రైతులకు సాంకేతిక సేవలు

Jul 21 2016 12:31 AM | Updated on Oct 19 2018 7:14 PM

‘ఈ–ఫ్రెష్‌’ ద్వారా రైతులకు సాంకేతిక సేవలు - Sakshi

‘ఈ–ఫ్రెష్‌’ ద్వారా రైతులకు సాంకేతిక సేవలు

గ్రామీణ రైతులకు పూర్తి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే ఈ–ఫ్రెష్‌ రైతు సమృద్ధి సేవాకేంద్రాల లక్ష్యమని నాబార్డ్‌ రాష్ట్ర అధికారి, ఈ–ఫ్రెష్‌ జిల్లా కోఆర్డినేటర్‌ దశరథ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్‌ మండలంలోని నిజామాబాద్‌ సహకార పరపతి సంఘంలో రైతు సమృద్ధి సేవాకేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

నిజామాబాద్‌ రూరల్‌ : గ్రామీణ రైతులకు పూర్తి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే ఈ–ఫ్రెష్‌ రైతు సమృద్ధి సేవాకేంద్రాల లక్ష్యమని నాబార్డ్‌ రాష్ట్ర అధికారి, ఈ–ఫ్రెష్‌ జిల్లా కోఆర్డినేటర్‌ దశరథ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్‌ మండలంలోని నిజామాబాద్‌ సహకార పరపతి సంఘంలో రైతు సమృద్ధి సేవాకేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను అతి తక్కువ ధరకు అందించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 140 సహకార సంఘాలుండగా, అభ్యుదయ సహకార సంఘాలుగా గుర్తించబడిన వంద సంఘా ల్లో రైతు సమృద్ధి సేవాకేంద్రాలు ఏర్పాటు చేసే లక్ష్యంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించేలా ఈ కేంద్రాల ద్వారా క్రయవిక్రయాలు జరుపనున్నట్లు తెలిపారు. ఈ సంస్థ లాభాపేక్షతో కాకుండా రైతులకు సేవలు చేరాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నామన్నా రు. నిజామాబాద్‌ సొసైటీలో వీటిని ఏర్పాటు చేసేందుకు రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా డాట్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ డా.పవన్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులు పంట భూములకు భూసార పరీ క్షలు చేయించుకోవాలని, పరీక్ష ఆధారంగా అధికారుల సల హాలు, సూచనల మేరకు ఎరువులు, క్రిమిసంహారక మం దులు వాడాలని రైతులకు సూచించారు. సమావేశంలో నిజామాబాద్‌ సొసైటీ చైర్మన్‌ అంతిరెడ్డి రాజారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కిషన్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్, సొసైటీ కార్యదర్శి సంతోష్, నాబార్డ్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ కృష్ణమూర్తి, శ్రీనివాస్, సుధాకర్, రైతు కూలీ సంఘం నాయకులు పాపయ్య, నాగయ్య, శర్పసాయన్న, సంతోష్, కర్రన్న, ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement