నాబార్డు నుంచి డిస్కమ్స్‌కు రూ.3,762.26 కోట్లు అప్పు | Chandrababu Govt provided guarantee for loan to DISCOMS from NABARD | Sakshi
Sakshi News home page

నాబార్డు నుంచి డిస్కమ్స్‌కు రూ.3,762.26 కోట్లు అప్పు

Dec 2 2025 10:48 AM | Updated on Dec 2 2025 10:48 AM

Chandrababu Govt provided guarantee for loan to DISCOMS from NABARD

సాక్షి, అమరావతి: నాబార్డు నుంచి విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కమ్స్‌) రూ.3,762.26 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ సోమవారం ఉత్తర్వు­లు జారీ చేశారు. ఎటువంటి షరతుల్లేని, మార్చలేని హామీకి లోబడి ప్రభు­త్వ­ం గ్యారెంటీ ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ విని­యోగదారులకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ఇన్‌స్టలేషన్‌ల అమలు కోసం ఈ రు­ణాన్ని వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఏపీఈపీడీసీఎల్‌కు రూ.1,294.87 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌కు రూ.1,162.86 కోట్లు, ఏపీఎస్‌పీడీసీఎల్‌కు రూ.1,304.53 కోట్లు కలిపి మొత్తం రూ.3,762.26 కోట్లు నాబార్డు ను­ంచి రుణం తీసుకుంటున్నట్లు వివరించారు. చంద్రబాబు సర్కారు ఇప్పటికే డిస్కమ్స్‌ పేరిట వివిధ బ్యా­ంకుల నుంచి విద్యుత్, బొగ్గు కొనుగోళ్ల పేరు­తో రూ.5,473 కోట్ల అప్పులకు గ్యారెంటీ ఇచ్చింది. ప్రస్తుత రూ.3,762.26 కోట్లు కూడా కలిపితే డిస్కమ్స్‌ అప్పులు రూ.9,235.26 కోట్ల­కు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినట్లయ్యింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement