టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి | tdp to ysrcp | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి

Dec 13 2016 12:22 AM | Updated on Aug 10 2018 8:23 PM

మండల పరిధిలోని చిట్యాల ఎంపీటీసీ సభ్యుడు చిన్న మాదన్నతోపాటు పైగేరి రంగనాయకులు, కమ్మరి వెంకటేశ్వర్లు, పెద్దనాగన్న, తురుక పెద్దలాలు, వంకాయల రంగన్న, తురక అబ్దుల్లాబాషా, మాదిగ పెద్ద అచ్చన్న, కేశన్న, మేకల సత్తన్న, దాసరి శేషయ్య, కొత్తరాముడుతోపాటు మరో 30మంది టీడీపీ నుంచి సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు.

కృష్ణగిరి: మండల పరిధిలోని చిట్యాల ఎంపీటీసీ సభ్యుడు చిన్న మాదన్నతోపాటు పైగేరి రంగనాయకులు, కమ్మరి వెంకటేశ్వర్లు,  పెద్దనాగన్న, తురుక పెద్దలాలు, వంకాయల రంగన్న, తురక అబ్దుల్లాబాషా, మాదిగ పెద్ద అచ్చన్న, కేశన్న, మేకల సత్తన్న, దాసరి శేషయ్య, కొత్తరాముడుతోపాటు మరో 30మంది టీడీపీ నుంచి సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ  పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చెరుకులపాడు లక్ష్మినారాయణరెడ్డి ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు.  2014ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ పోటీ చేసిన గెలిచిన చిన్నమాదన్న ఆ తర్వాత టీడీపీలో చేరడం తెలిసిందే. అయితే అక్కడ ఆ పార్టీ నాయకుల ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్క నాగరాజు, యూత్‌ అధ్యక్షుడు లక్ష్మికాంతరెడ్డి, చిట్యాల నాయకులు సుధాకర్‌రెడ్డి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement