అధికార తెలుగుదేశం దౌర్జన్యాలు ఆగేట్టుగా లేవు. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు.
హిందూపురం: అధికార తెలుగుదేశం దౌర్జన్యాలు ఆగేట్టుగా లేవు. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా అన్ని స్థాయిల్లోనూ ఈ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ దళిత మహిళపై టీడీపీ కౌన్సిలర్ ఒకరు దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని 11వ వార్డు మోడరన్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం నీటి విషయంలో సుగాల లక్ష్మికి స్థానిక మహిళల మధ్య చిన్న ఘర్షణ జరిగింది.
అది కాస్త పెద్దదై స్థానిక కౌన్సిలర్ రామ్మూర్తి జోక్యం చేసుకుని, మరికొందరితో కలసి లక్ష్మిపై దాడి చేసి కొట్టారు. సమాచారం తెలుసుకుని వచ్చిన పోలీసులపై కూడా వారు అసభ్యకరంగా దూషించి దౌర్జన్యం చేయబోయినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.