సూర్యాపేట : ఈ నెల 21వ తేదీన తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య సూర్యాపేటలోని జమ్మిగడ్డలో గలసుమంగళి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించనున్న మర్చంట్స్‌డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బ్రాహ్మాండపల్లి మురళీధర్‌గుప్త తెలిపారు.
21న సూర్యాపేటకు తమిళనాడు గవర్నర్ రాక
Aug 6 2016 9:51 PM | Updated on Sep 4 2017 8:09 AM
సూర్యాపేట : ఈ నెల 21వ తేదీన తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య సూర్యాపేటలోని జమ్మిగడ్డలో గలసుమంగళి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించనున్న మర్చంట్స్‌డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బ్రాహ్మాండపల్లి మురళీధర్‌గుప్త తెలిపారు. శనివారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం కమిటీ ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ నెల 21న మర్చంట్స్‌డే, ఆర్యవైశ్య జనాభాగణనకు సంబంధించిన వెబ్‌సైట్‌ను పూర్తి వివరాలతో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ రోశయ్యతో పాటు రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నిజామాబాద్‌ఎమ్మెల్యే బీగాల గణేష్‌గుప్తా, గిరీష్‌సంఘీ, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, వీరెల్లి లక్ష్మయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ఈగ దయాకర్, గోపారపు రాజు, నూక వెంకటేశం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement