ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో అవసరం | Taekwondo for discipline | Sakshi
Sakshi News home page

ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో అవసరం

Feb 25 2017 12:03 AM | Updated on Sep 5 2017 4:30 AM

ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో అవసరం

ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో అవసరం

ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో క్రీడ ఎంతో అవసరమని తైక్వాండో జిల్లా కార్యదర్శి జి. శోభన్‌బాబు అన్నారు.

కర్నూలు(టౌన్‌): ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో క్రీడ ఎంతో అవసరమని తైక్వాండో జిల్లా కార్యదర్శి జి. శోభన్‌బాబు అన్నారు. శుక్రవారం స్థానిక ఏ.క్యాంపు మాంటిస్సోరి స్కూలు ఆవరణలో జిల్లా స్థాయి తైక్వాండో సబ్‌జూనియర్‌ బాలికల పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో సబ్‌ జూనియర్‌ బాలికలు 100 మంది పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తైక్వాండో జిల్లా కార్యదర్శి జి. శోభన్‌ బాబు మాట్లాడుతూ మార్షల్‌ ఆర్ట్స్‌ తైక్వాండో అభ్యసించడంతో క్రమబద్ధమైన జీవనం అలవాడుతుందన్నారు. బాలికలు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు.  కార్యక్రమంలో తైక్వాండో క్రీడాకారులు, మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement