వైఎస్సార్ జిల్లా లోఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
వైఎస్సార్ జిల్లా లోఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజంపేట మండలం బలిజపల్లి గ్రామం పూసల కాలనీలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. మూడు నెలల గర్భిణి అయిన అంజమ్మ ఉదయం అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తమ కుమార్తెను చేతబడి చేసి చంపారని మృతురాలి తల్లి ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.