కాగతి పాఠశాలలో క్షుద్రపూజల ఆనవాళ్లు
భయాందోళనకు గురవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు
చౌడేపల్లె: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పాఠశాలలో 94మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో సోమవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు. ఆదివారం రాత్రి మౌని అమావాస్య సందర్భంగా గ్రామంలోని కొందరు పాఠశాల వంట గది సమీపంలో ముగ్గుపోసి, నిమ్మకాయలు కోసి, తాంబూలం పెట్టి, అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లి తాంత్రిక పూజలు చేసినట్లు గుర్తించి భయాందోళనకు గురయ్యారు.
6 నెలలుగా గుర్తు తెలియని వ్యక్తులు తరగతి గదుల వరండాలో మల, మూత్ర విసర్జన చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. గ్రామస్తులు, యువత సహకారంతో పాఠశాలకు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.


