సర్వే ‘స్మార్ట్‌’గా జరగాలి: ఆర్డీఓ | survey should be smart says rdo | Sakshi
Sakshi News home page

సర్వే ‘స్మార్ట్‌’గా జరగాలి: ఆర్డీఓ

Jul 18 2016 6:35 PM | Updated on Sep 4 2017 5:16 AM

సర్వేను పరిశీలిస్తున్న ఆర్డీఓ గోవిందరావు

సర్వేను పరిశీలిస్తున్న ఆర్డీఓ గోవిందరావు

ఇంటింటా స్మార్ట్‌ సర్వే సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గోవిందరావు సూచించారు. ఆయన బలిజిపేటలో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం పరిశీలించారు.

బలిజిపేట రూరల్‌: ఇంటింటా స్మార్ట్‌ సర్వే సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గోవిందరావు సూచించారు. ఆయన బలిజిపేటలో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం పరిశీలించారు. పి.శ్రీరాములు అనే ఎన్యూమరేటర్‌కు ఇచ్చిన 500 గృహాల సర్వేను నిర్వహిస్తుండగా పరిశీలించారు. సర్వేను ఏవిధంగా చేయాలనేది ఎన్యూమరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. సర్వే నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని సూపర్‌వైజర్లకు, అధికారులకు తెలిపారు. సిగ్నళ్లు, ట్యాబ్‌ల పనితీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ బీవీ లక్షి్మ, ఎంపీడీఓ రాజు, ఏఎస్‌ఓ సురేష్, ఏపీఎం ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement