సుద్దపల్లి రైతులకు సంఘీభావం | Support to Suddapalli farmers | Sakshi
Sakshi News home page

సుద్దపల్లి రైతులకు సంఘీభావం

Dec 17 2016 8:12 PM | Updated on Oct 1 2018 2:09 PM

సుద్దపల్లి రైతులకు సంఘీభావం - Sakshi

సుద్దపల్లి రైతులకు సంఘీభావం

సాగు నీటి చెరువును క్వారీగా మార్చటానికి వ్యతిరేకంగా సుద్దపల్లి రైతులు చేపట్టిన ఆందోళనలకు శనివారం పలువురు సంఘీబావం తెలిపారు.

సుద్దపల్లి (చేబ్రోలు): సాగు నీటి చెరువును క్వారీగా మార్చటానికి వ్యతిరేకంగా సుద్దపల్లి రైతులు చేపట్టిన ఆందోళనలకు శనివారం పలువురు సంఘీబావం తెలిపారు. 800 ఎకరాలకు సాగునీరు అందించే చేబ్రోలు మండలం సుద్దపల్లి పెద్ద చెరువు వద్ద తవ్వకాలు చేపట్టవద్దంటూ స్థానిక రైతులు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత,  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుద్దపల్లి గ్రామానికి వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. శనివారం సీపీఐ జిల్లా నాయకులు అద్దేపల్లి మురళి, ప్రజా సంఘాల ఐక్య వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు దాసరి థామస్‌  సుద్దపల్లి పెద్ద చెరువు వద్దకు వచ్చి రైతులకు సంఘీబావం తెలిపారు. అలాగే జనసేన పార్టీ జిల్లా నాయకులు బండ్రెడ్డి శివ, చందు, సుంకర సతీష్, మహిళా సంఘం నాయకులు సుద్దపల్లి రైతులకు మద్దతు తెలియజేశారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించి పెద్ద చెరువు తవ్వకాలు జరిపితే అందరి సహకారంతో ఉద్యమిద్దామని వారు పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మైలా హనుమంతరావు, స్థానిక నాయకులు ఎం.పోతురాజు, ముత్యం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement