
ఆకలి కేకలు
వర్షాభావ పరిస్థితులు, రోజురోజు పెరుగుతున్న ఎండలతో మెతుకుసీమ బీడుగా మారుతుంది.
వర్షాభావ పరిస్థితులు, రోజురోజు పెరుగుతున్న ఎండలతో మెతుకుసీమ బీడుగా మారుతుంది. అయితే కరువు ప్రజలనే కాదు వణ్యప్రాణులను సైతం ఇబ్బంది పెడుతోంది. వణ్యప్రాణులు గ్రాసం దొరకక ఆకలికేకలతో అల్లాడుతున్నాయి. మనూరు మండలం మోర్గీ శివారులోగల బీడుభూముల్లో గతంలో దాదాపు 400ల జింకలు సంచరిస్తుండేవి. కానీ నేడు ఆ భీడుభూములో రాళ్లు తప్ప గ్రాసం లేదు. దీంతో జింకలు కనుమరుగయ్యాయి.తాగేందుకునీరు, మేతలేక గ్రామాల్లోకి వణ్యప్రాణులు వస్తున్నాయి.
-కె.సతీష్,సాక్షిఫొటోగ్రాఫర్,సంగారెడ్డి