సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఓ జింక.. కారును ఢీకొట్టింది. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన జింక కారును ఢీకొనడంతో గాయపడింది. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న యూనిమల్ ప్రొటెక్షన్ టీమ.. జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.
తెలిసిన సమాచారం మేరకు.. గచ్చిబౌలి లో కారును ఢికోన్న జీంక.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది. గచ్చిబౌలి-లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిపైకి రావడంతో కారును జింక ఢీకొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ అక్కడికి చేరుకుంది. అనంతరం, జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నట్టు సిబ్బంది తెలిపారు.


